కుల‌వృత్తిలో `కేజీఎఫ్` మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. క‌న్న‌డ చిత్రాల్లోనే స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలోనూ పుర‌స్కారాల్ని ద‌క్కించుకుంది. ఈ చిత్రంలోని ఫైట్స్‌, ఫొటోగ్ర‌ఫీకి ఎంత పేరొచ్చిందో ర‌వి డాస్రూర్ అందించిన నేప‌థ్య సంగీతానికి, పాట‌ల‌కు అంతే పేరొచ్చింది. అయితే ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగీత ద‌ర్శ‌కుడు ర‌వి బాస్రూర్ ప్ర‌స్తుతం సొంత ఊరిలో కుల వృత్తి చేసుకుంటున్నాడు.

ఫేస్ బుక్ వేదిక‌గా ర‌వి బాస్రూర్ పెట్టిన ఓ వీడియో షాక్‌కు గురిచేస్తోంది. షార్ట్ వేసుకుని కింద కూర్చుని కొలిమి ద‌గ్గ‌ర కూర్చుని రవి బాస్రూర్ కుల వృత్తి చేసుకుంటున్నాడు. అత‌ని రోజు వారీ సంపాద‌న 35 రూపాయ‌ల‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. దీంతో చాలా మంది సిటీని వ‌దిలి సొంత ఊళ్ల‌కు వెళ్లిపోయారు. అక్క‌డే త‌మ వారితో క‌లిసి ఈ క్రూషియ‌ల్ టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. రవి బాస్రూర్ కూడా అలాగే త‌న సొంత ఊరు వెళ్లాడ‌ట‌. అక్క‌డే త‌న తండ్రి చేస్తున్న కుల వృత్తిని చేస్తున్నాడ‌ట‌. దీని ద్వారా రోజుకి 35 రూపాయ‌లు సంపాదిస్తున్నాన‌ని, దీనికి సంబంధించిన ఫొటోల‌తో పాటు ఓ వీడియోని కూడా షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.