హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన హీరో ఆనంద్ దేవరకొండ.’దొరసాని’ ఆశించిన బ్రేక్ ఇవ్వకపోయినా అతనికి అవకాశాలకు కొదవ లేదు. అప్పుడే అతని రెండో సినిమా షూటింగ్ చేస్తుండగానే అతని మూడో చిత్రానికి సంతకం చేసాడు. విజయ దశమి సందర్బంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే…
దామోదర్ అట్టాడ అనే లఘు చిత్ర దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఒక కామెడీ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని తంగ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఆనంద్ కొత్తగా కనిపిస్తారని దర్శకనిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు.
అన్ని రసాల్లోకి హాస్యం చాలా కష్టం, మరి కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి కథతో మనల్ని ఏ మేర నవ్విస్తాడో చూడాలి.