కాజ‌ల్ అగర్వాల్ ఎంత తీసుకుంది?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. న‌క్స‌లిజ‌మ్ నేప‌థ్యంలో అందులోని మూల‌ల‌ని అన్వేషిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌ని తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేశారు.

అయితే ఈ చిత్రం నుంచి హీరోయిన్ త్రిష క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే చ‌ర్చ మొద‌లైంది. టీమ్ వెంట‌నే కాజ‌ల్‌ని సంప్ర‌దించ‌డం, రెమ్యున‌రేష‌న్ డిమాండ్‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని అంగీక‌రించ‌డం చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. కాజ‌ల్ అడిగినంత మొత్తాన్ని రామ్‌చ‌ర‌ణ్ ఇవ్వ‌డాని సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేశార‌ట‌. దీంతో కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. వ‌చ్చే నెల నుంచి కాజ‌ల్ షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.