సుకుమార్.. టాలీవుడ్‌లో క్వాలిక్యులేషన్స్‌తో సినిమాలు చేసే దర్శకుడు. ప్రస్తుతం ఈయన పేరు.. ఈయన చెప్పిన మాట టాలీవుడ్ వర్గాల్ని బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా `పుష్ప` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సుక్కు తరువాత ఓ కాంట్రవర్శీ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నాడట. ఆ కథే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 – 51 మధ్య కాలంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం వుంది.
కానీ ఆ చరిత్రని చెత్తబుట్టలోకి నెట్టేసి కాల గర్భంలో కలిపేశారు. భారతీయ తెరపై ఇప్పటి వరకు ఎన్నో స్వాతంత్రోద్యమ నేపథ్య చిత్రాలు రూఊపొందాయి. చరిత్ర తెలియని వాళ్లకి చరిత్రలో ఏం జరిగిందో తెలియజెప్పే ప్రయత్నం చేశాయి. కానీ తెలంణాలో నిజాం నిరంకుశ పాలనలో ఏం జరిగిందో ఎంత మంది బలయ్యారో.. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగిందో మాత్రం చెప్పడానికి ఎవరూ సాహసించలేకపోయారు.
కారణం సెన్సిటివ్ ఇష్యూ అన్న ఒకే ఒక్క సాకుతో. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. భారతీయ సినిమా. అంతులోనూ తెలుగు సినిమా అంటే యావత్ ప్రపంచం అటెన్షన్‌తో ఎదురుచూసే సమయం వచ్చింది. మార్కెట్ పరిధులు పెరిగాయి. ఈ కథకు ఇదే సరైన సమయమని నమ్మిన సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని ఈ కథతోనే చేయబోతున్నానని ప్రకటించారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎన్. శంకర్ లాంటి దర్శకుడు కొన్నేళ్ల క్రితం వెంకటేష్‌తో చేయాలని ప్రయత్నించినా కొంత మంది నిర్మాతలు వెంకటేష్‌ని భయపెట్టడంతో పట్టాలెక్కాల్సిన సినిమా కాస్తా ఆగిపోయింది. అదే నేపథ్యాన్ని సుకుమార్ ఎంచుకుని సినిమా చేస్తానని చెప్పడంతో టాలీవుడ్ బడా నిర్మాతలు కాంట్రవర్శీ కథని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం సాహసమే అవుతుందని, సుక్కు అలాంటి సాహసానికి పూనుకోవద్దని చెబుతున్నారట.