ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్‌ వీడియో సందేశం!

చాప‌కింద నీరులా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ చుట్టేస్తోంది. దీని ధాటికి అగ్ర రాజ్యం నుంచి చిన్న దేశాల వ‌ర‌కు వ‌ణికిపోతున్నాయి. ప్ర‌జ‌లంతా బ‌య‌టికి రావాలన్నా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో దేశాల‌న్నీ అప్ప‌మ‌త్త‌మ‌య్యాయి. నివార‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాయి. ఇప్ప‌టికే దేశ ప్ర‌దాని క‌రోనాని అరిక‌ట్టాలంటే నివార‌ణ ఉక్క‌టే మార్గ‌మ‌ని, ప్ర‌జ‌లంతా అప్ప‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. రెండు వారాల పాటు సినిమా హాల్స్‌, స్కూల్స్ మూసి వేయాల‌ని సూచించారు.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండు వారాల పాటు సినిమా హాల్స్‌, స్కూల్స్‌ని బంద్ చేయాల్సిందిగా ఉత్త‌ర్వులు జారిచేసింది. ఈ నేప‌థ్యంలో త‌మ వంతు బాధ్య‌త‌గా చిరంజీవి త‌న సినిమా షూటింగ్‌ని నిలిపివేస్తున్నాన‌ని, త‌న‌లాగే మిగతా వారు కూడా షూటింగ్‌లు రెండు వారాల పాటు బంద్ చేయాల‌ని పిలుపునివ్వ‌డంతో తెలిసిందే. తాజాగా క‌రోనా వైర‌స్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డం కోసం హీరో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ముందుకొచ్చారు. ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ప్రంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించిన 6 సూత్రాల‌ని పాటిస్తే క‌రోనాని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని, మ‌న‌ ద‌రికి రాకుండా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు.

1. చేతుల్ని స‌బ్బుతో మోచేతి వ‌ర‌కు శుభ్రంగా క‌డుక్కోవ‌డం,
రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు క‌డుక్కోవాలి.

2 . క‌రోనా వైర‌స్ త‌గ్గేవ‌ర‌కు తెలిసిన వాళ్లు ఎదురుప‌డితే కౌగిలించుకోవ‌డం, షేక్ హ్యాండ్స్ ఇవ్వ‌డం మానండి.

3. అన‌వ‌స‌రంగా క‌ళ్లు తుడుచుకోవ‌డం, ముగ్గు రుద్దుకోవ‌డం కూడా మానేయాలి,

4. పొడిద‌గ్గు, జ్వ‌రం. జ‌లుబు వుంద‌నిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. అన‌వ‌సంగా వేసుకుంటే క‌రోనా మీకు అంటుకునే ప్ర‌మాదం వుంది.

5. తుమ్మిన‌ప్పుడు, ద‌గ్గిన‌ప్పుడు అర‌చేతిని కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి,

6. జ‌నం ఎక్కువ‌గా వుండే చోటుకి వెళ్ల‌కండి. మంచి నీళ్లు ఎక్క‌వ తాగండి. త్వ‌ర‌గా తాగ‌కుండా నిదానంగా తాగండి. వేడి నీళ్ల‌యితే ఇంకా మంచిది.

7. వాట్సాప్‌లో వ‌చ్చే ప్ర‌తీ వార్త‌నీ న‌మ్మేయ‌కండి. అందులో నిజ‌మెంతో తెలియ‌కుండా ఫార్వ‌ర్డ్ చేయ‌కండి. దాని వ‌ల్ల అన‌వ‌స‌రంగా భయాన‌క‌మైన ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ఇది వైర‌స్ క‌న్నా ప్ర‌మాద‌క‌రం. ప్ర‌భుత్వం ఇచ్చే స‌ల‌హాల్ని పాటిద్దాం. మ‌న‌ల్ని మ‌న‌మే ప్రొటెక్ట్ చేసుకుందాం. అని ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న కోసం ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ విలువైన సూచ‌న‌లు చేశారు.