ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో ఓ భారీ చిత్రం తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. `అల వైకుంఠపురములో` తరహాలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్, ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.
ఈ బడ్జెట్‌లో హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌లకే దాదాపుగా 60 కోట్లు ఇవ్వబోతున్నారట. అంటే మిగతా నటీనటులు, టెక్నీషియన్‌లకి, ప్రొడక్షన్‌కి కలపి 60 అవుతుందన్నమాట. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల కలయికలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో మాటల మాంత్రికుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్‌లు వేస్తున్నారట.