ఇలియానా దశ “అమర్ అక్బర్ ఆంథోనీ “తో తిరుగుతుందా ?

చాలాకాలం తరువాత ఇలియానా తెలుగు సినిమా “అమర్ అక్బర్ ఆంథోనీ ” లో నటించింది . మైత్రి మూవీస్ వారు శ్రీను వైట్ల  దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందించారు . ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది .

ఇలియానా తెలుగు సినిమా కన్నా హిందీ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముంబైలో స్థిరపడింది . పెళ్లి కూడా చేసికొని ట్లేహు వైపు చూడటం మానేసింది . అయితే ఈ సినిమా కోసం శ్రీను వైట్ల పట్టుపట్టి మరీ హీరోయిన్ గా ఎంపిక చేశాడు .  గతంలో ఇలియానా, రవితేజ జంటగా చేసిన సినిమాలు హిట్ అయ్యాయి .

ఇక “అమర్ అక్బర్ ఆంథోనీ ” సినిమాలో ఇలియానా తో మరో మంచి కార్యక్రమం కూడా చేయించాడట డైరెక్టర్ శ్రీను వైట్ల . 2006లో “దేవదాస్ ” సినిమాతో పరిచయం అయిన ఈ గోవా సుందరి తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించింది . అయితే ఆమె గొంతు మాత్రం  డబ్  చేశారు . ఇప్పుడు “అమర్ అక్బర్ ఆంథోనీ ” సినిమాలో ఇలియానా మొదటిసారి తన పాత్రకు తానే  డబ్బింగ్ చెప్పుకుందట . ఈ సినిమా 16న విడుదలవుతుంది . ఇలియానా  గొంతు బాగుందా లేదా అన్నది 16నే తెలుస్తుంది . బాగుంటే మళ్ళీ ఇలియానా వెంట నిర్మాతలు పడటం ఖాయం .