కార్పొరేట్ దిగ్గాజాలని తట్టుకుని సాధారణ సమ్రాజ్యం నిలబడటం కష్టం అన్న చిన్న లాజిక్ తెలిసిందే. అయితే వెనకాల పెద్ద అనకొండలాంటి అండే వున్నా అల్లు అరవింద్ ఆడియన్స్ చేత `ఆహా` అనిపించలేకపోతున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5కు ధీటుగా అల్లు అరవింద్ `ఆహా` ఓటీటీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఓటీటీ ప్రచారం కోసం విజయ్ దేవరకొండని రంగంలోకి దింపేసి ప్రచారం మొదలుపెట్టిన అల్లు అరవింద్ ఏ కంటెంట్‌ని పడితే ఆ కంటెంట్‌ని ఓకే చేశారట. అది జనానికి పెద్దగా ఎక్కడం లేదని తెలిపింది. క్రిష్ చేసిన మస్తీస్, కార్తీ నటించిన `ఖైదీ` తప్ప ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే స్టఫ్ ఏమీ `ఆహా`లో లేదని వినిపిస్తోంది. మరి మై హోమ్ రామేశ్వరరావు పెట్టిన పెట్టుబడి అంతా ఎటు వెళ్లినట్టు ఆహా పేరుతో స్వాహా అయిపోయిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదిలా వుంటే అల్లు అరవింద్ `ఆహా` కోసం అల్లు అర్జున్‌ని కూడా దించేస్తున్నాడు. అయినా `ఆహా`పై మాత్రం బజ్ రావడం లేదు. ఒక వేళ త్రివిక్రమ్ బన్నీతో చేస్తున్న యాడ్ అయినా వీక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందో.. లేక పేరుకు భిన్నంగా స్వాహా అవుతుందో చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.