ఈ మధ్య టీవీ యాంకర్ల గ్లామర్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ కొంచం పాపులారిటీ వచ్చిన యాంకర్లయితే మరీనూ హీరోయిన్లను మించిపోయే డ్రస్సులు అదేవిధంగా వారి ప్రవర్తన నడవడిక ఉంటుంది. అందులోనూ ఈ మధ్య యాంకర్లకు కాస్త సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలుపెట్టాక ఆ పొగరు కాస్త మరింత మునగచెట్టు ఎక్కి కూర్చుంది అన్నట్లు ఉంది వాళ్ళ పద్ధతి.
ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరికైనా సరే కాస్త పాపులారిటీ వచ్చిందంటే చాలు ఏకంగా వాళ్ళ సీనే మారిపోతుంది. ఏదో పెద్ద గొప్పగా ఫీలయిపోతుంటారు కొందరు. ఇలాంటివన్నీ ఎక్కువగా ఎవరికి ఉంటాయంటే అతితక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించేసి మాకంటే హీరోయిన్లు ఎవ్వరూ ఉండరు అన్నట్లు ఫీలయిపోతుంటారు. ఇక వాళ్ళ సినిమాకి సంబంధించి ఏదైన ప్రెస్‌మీట్‌లు పెట్టినా ఏదైనా ఒక మీడియా సంస్థకి ఇంటర్వూ ఇవ్వాలన్నా ఇక వాళ్ళు చూపించే బెట్టు అంతా ఇంతా కాదు. ఓస్టార్ హీరోయిన్ కోసం వెయిట్ చేసినంత సేపు ఆమె కోసం వెయిట్ చెయ్యాలి.
ఆమెకున్న పొగరు అంతా ఇంతా కాదు. ఈమె పొగరుకి పోలీస్ స్టేషన్‌లో గతంలో ఓ మహిళ ఫిర్యాదు కూడా చేసింది. తమ ఫోన్ పగలగొట్టడంతో పాటు దుర్భాషలాడిందని సదరు మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తార్నాక ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోగా, బాధితురాలు ఉస్మానియా యూనివర్శిటీ పరిధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని తార్నాక ప్రాంతానికి ఏదో పని మీద అనసూయ వచ్చారు. అదే సమయంలో తన తల్లితో పాటు అటుగా వెళుతున్న ఓ బాలుడు అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమె వద్దకు వెళ్లి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే సదరు బాలుడు సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించడంతో యాంకర్ కోపోద్రిక్తురాలైంది. బాలుడి చేతిలోని ఫోన్ లాక్కుని నేలకేసి బద్దలు కొట్టింది. దీంతో తల్లీ కొడుకులతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. తమ ఫోన్ బలవంతంగా లాక్కుని బద్దలు కొట్టడంపై తల్లీ కొడుకులు ఆమెను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండానే ఆమె వారిని దుర్భాషలాడుతూ అక్కడి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.