బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశలో ఉంది. మొదటి నుండి ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ ఎంపికపై బిగ్ బాస్ అభిమానులు పెదవి విరుస్తూనే ఉన్నారు. సాదా సీదా ఆర్టిస్టులతోనే ఈ సీజన్ ని మొదలు పెట్టారు. వారిలో సగం మంది కంటెస్టెంట్స్ ఎవరనేది చాలా మంది ప్రజలకి తెలియనే తెలియదు. కానీ ఎలాగోలా ప్రస్తుతం ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మొదట ఈ సీజన్‌లో యాంకర్ విష్ణు ప్రియ ఒక కంటెస్టెంట్‌గా వెళ్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే ఆ వార్తల్ని అప్పట్లోనే విష్ణు ప్రియ ఖండించేసి రూమర్ లకి చెక్ పెట్టేసింది. తాజాగా బిగ్ బాస్ షో మీద తన అభిప్రాయాన్ని వివాదాస్పద మైన రీతిలో మీడియాతో పంచుకుంది.
బిగ్ బాస్ కాన్సెప్టే తనకు నచ్చదని, ఆ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, ఎలిమినేషన్ అంటే తనకు ఇష్టం ఉండదని, కంటెస్టెంట్‌గా వెళ్లనని తేల్చిచెప్పింది.నా లైఫ్ ని నా రూల్స్ తోనే ఎంజాయ్ చేస్తాను, ఇంకొకరు (బిగ్ బాస్) రూల్స్ పెడితే అది నాకు ఇష్టముండదు అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది యాంకర్ విష్ణు ప్రియ. అవినాష్ నాకు బెస్ట్ ఫ్రెండ్ . వాడు చాలా మంచోడు. నాకులానే ఎప్పుడు తన వారికోసం ఎంతటి కష్టమైనా చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచాలని అనుకుంటాడు . అందుకనే వాడు ఈ షో లో గెలవాలని కోరుకుంటాను అని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ… ‘నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండదు.అలాంటి బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లను. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక హౌస్‌లోకి వెళ్లి బంధీగా ఎందుకు ఉండాలి. నేను చేసే పనిని నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేసిన తరువాతే అవతలి వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. నా గోల్ ఏంటంటే…నేను నవ్వుతూ ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్లు కూడా నవ్వుతూ ఉండాలి. టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, నాకు వెంటనే డబ్బులు వచ్చేయాలి,పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని అయితే లేదు. నాగార్జున గారు కాల్ చేసి బిగ్ బాస్ లో కి రమ్మని అడిగితే ఏం చెప్తారని అడగగా… నాగార్జున గారు ఎదుటి వారి అభిప్రాయాలకు విలువనిచ్చే మనిషిగా నాకు తెలుసు, నాకు ఇష్టం లేదని చెప్తే ఆయన నన్ను అర్ధం చేసుకుంటారని నేను అనుకుంటున్నానని చాలా తెలివిగా చెప్పి తప్పించుకుంది ఈ ముద్దుగుమ్మ.