వయ్యారాలతో ఊపేసింది.. వయస్సునామి అంటోన్న అనసూయ

Anasuya Bharadwaj Dance In Jabardasth

అనసూయ అందాలకు కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిందే. అనసూయ కనిపిస్తే చాలు బుల్లితెరపై ఏదో మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది. రోజురోజుకూ చిన్న పిల్లలా మారిపోతోంది. అనసూయ జబర్దస్త్ స్టేజ్ మీద వేసే స్టెప్పులు, పంచ్‌లు ఎంతగా వైరల్ అవుతాయో అందరికీ తెలిసిందే. చీరకట్టులో అయినా మోడ్రన్ డ్రెస్‌లో అయినా సరే అనసూయ కాలు కదిపితే రచ్చ రచ్చ అవుతుంది. జబర్దస్త్ స్టేజ్ మీద ప్రతీవారం అనసూయ వేసే మూమెంట్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అవుతుంటాయి.

Anasuya Bharadwaj Dance In Jabardasth
Anasuya Bharadwaj Dance In Jabardasth

జబర్దస్త్ షోలో అనసూయ స్కిట్ల మధ్యలో వేసే పంచ్‌లు, హైపర్ ఆది ఇతర టీం సభ్యులు అనసూయపై కౌంటర్లు ఎలా వేస్తారు.. తిరిగి ఆమె రివర్స్ కౌంటర్లు ఎలా వేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ వారంలో అనసూయ మాత్రం తన డ్యాన్స్‌తోనే అందరినీ పడగొట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె వేసిన స్టెప్పులు, ఆ వయ్యారాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వయస్సునామి అంటూ అందరిలోనూ కాకరేపింది.

అనసూయ డ్యాన్సులకు ఎంతో ఫేమస్. అనసూయలో ఓ స్పెషల్ గ్రేస్ ఉంటుంది. అందుకే అనసూయతో ఓ మాస్ ఐటెం సాంగ్‌ను చేయించారు. సాయి ధరమ్ తేజ్‌తో కలిసి అనసూయ వేసిన స్టెప్పులు బాగానే వైరల్ అయ్యాయి. అయితే వెండితెరపై ఎప్పుడో ఒకసారి అనసూయ స్టెప్పులు కనిపిస్తాయి. కానీ బుల్లితెరపై ప్రతీ వారం కనిపిస్తాయి. ఈ వారం కంత్రిలోని వయస్సునామి అనే పాటకు డ్యాన్స్ చేసి నిజంగానే అందరినీ ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.