`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ఎందుకు మారింది?

రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీంల ఫిక్ష‌న‌ల్ స్టోరీగా రూపొందిస్తుండ‌టంతో వారి పాత్ర‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఎలా క‌నిపించ‌బోతున్నారా? అని అంతా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ `మోట‌ర్ సైకిల్ డైరీస్‌` స్ఫూర్తిగా తీసుకుని దానికి ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అజ్ఞాత జీవితాన్ని అడాప్ట్ చేసి ఈ సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

`బాహుబ‌లి` సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు సినిమాకు క్రేజ్ పెర‌గ‌డంతో ఆ క్రేజ్‌ని మించి తాజా చిత్రాన్ని క‌నీవినీ ఎరుగ‌ని హంగుల‌తో, స‌ర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో తీర్చి దిద్దుతున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడెప్పుడు రాబోతోందా అని ఈగ‌ర్‌గా వుయిట్ చేస్తున్న ప్రేక్ష‌కుల‌కు `ఆర్ ఆర్ ఆర్` తాజాగా పిడుగు లాంటి వార్త‌ని ప్ర‌క‌టించింది. ముందు అనుకున్న ప్ర‌కారం ఈ చిత్రాన్ని జూలై30న కాకుండా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నామంటూ దాన‌య్య ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది. ఉన్న‌ట్టుండి సినిమా రిలీజ్ డేట్‌ని `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ ఎందుకు మార్చింది అని ఆరాతీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. `బాహుబ‌లి` క‌థ చెప్ప‌డానికి మామూలుదే అయినా దాన్ని రాజ‌మౌళి తెర‌పైకి ఎక్కించిన తీరు యావ‌త్ దేశాన్ని అబ్బుర‌ప‌రిచింది.

గ్రాఫిక్స్‌, మాహిష్మ‌తి సామ్రాజ్యం, వాట‌ర్ ఫాల్స్‌, మాహిష్మ‌తి ముఖ ద్వారం, హంస నావ‌.. ఇలా చెప్పుకుంటూ పోతే హాలీవుడ్ సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమాని గ్రాఫిక్స్‌తో క‌ట్టిప‌డేశారు. `ఆర్ ఆర్ ఆర్‌`లో అంత‌కు మించిన గ్రాఫిక్స్‌ని చూపించ‌బోతున్నార‌ట‌. ముఖ్యంగా ఎన్టీఆర్ అభ‌యారణ్యంలో పులితో చేసే ఫైట్ ఇండియ‌న్ స్క్రీన్‌పై నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆప్ట‌ర్ అనే విధంగా చిత్రీక‌రించార‌ట‌. దీనికి గ్రాఫిక్స్ హంగులు హైలైట్గా నిల‌వ‌నున్నాయ‌ట‌. దీనికితోడు రామ్‌చ‌ర‌ణ్ పై వ‌చ్చే స‌న్నివేశాలు.. ఇలా స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద ప‌నే వుంద‌ట‌. ఆ కార‌ణంగానే సినిమా రిలీజ్‌ని వాయిదా వేసి జ‌న‌వ‌రి 8కి మార్చిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.