ఆగష్టు 9 న నాగ్ ‘మన్మధుడు 2’

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా న‌టిస్తోన్న చిత్రం మ‌న్మ‌థుడు 2. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్
పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తాజాగా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది.
చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను
త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్రణాళిక వేస్తున్నారు.
మంగ‌ళవారం ఈ సినిమాలో అవంతిక పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ క్యారెక్ట‌ర్‌ను
ప్రోమో రూపంలో విడుదల చేశారు.

న‌టీన‌టులు:
కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు