యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో రకుల్.!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ.? ఈ మధ్య టాలీవుడ్‌లో వినిపిస్తున్న ప్రశ్న ఇది. గత కొంత కాలంగా ఆమె బాలీవుడ్ సినిమాలకే పరిమితమైపోయింది.

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ కారణంగా ఆమె కెరీర్ దాదాపు ఖతం అయిపోయింది తెలుగు సినీ పరిశ్రమలో.. అన్న గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఓ భారీ ప్రాజెక్టుతో తెలుగులో మళ్ళీ సందడి చేయబోతోందిట రకుల్ ప్రీత్ సింగ్. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఆమె కథానాయికగా నటించబోతోందిట. పైగా, అది లేడీ ఓరియెంటెడ్ మూవీ తరహాలో వుండబోతోందిట.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రకుల్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి ఓ యంగ్ హీరో సపోర్ట్ కూడా ఈ ప్రాజెక్టుకి వుందట.

త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం. టాలీవుడ్‌కి తాను దూరం కాలేదనీ, త్వరలోనే ఓ మంచి ప్రాజెక్టుతో రాబోతున్నానని ఇటీవల రకుల్ చెప్పింది ఓ ఇంటర్వ్యూలో.