అల వైకుంఠ‌పుర‌ములో.. `అర్జున్‌రెడ్డి 2`

బ‌న్పీ నటించిన ఇండ‌స్ట్రీ హిట్ `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర‌వింద‌; ఎస్‌. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలోని పాట‌లు 100 మిలియ‌న్ వ్యూస్‌ని దాటి రికార్డు సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం కోసం చిత్రీక‌రించి నిడివి ఎక్కువ కావ‌డంతో సుశాంత్‌, అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ వీడియోని డిలిట్ చేశార‌ట‌.

ఆ వీడియోని టీమ్ తాజాగా రిలీజ్ చేసింది. సుశాంత్ రాజ‌కుమారుడి త‌రహాలో ఈత కొడుతూ అల్లు అర్జున్ త‌గ్గ‌రికి రావ‌డం.. అదే స‌మ‌యంలో సుశాంత్‌కి సంబంధించిన సీక్రెట్ వీడియోని బ‌య‌ట పెట్టి బ్లాక్ మెయిల్ చేయ‌డం ఫ‌న్నీగా వుంది. అయితే ఈ వీడియోలో సుశాంత్ `అర్జున్‌రెడ్డి` త‌ర‌హాలో మందు బాటిల్‌ని దించ‌కుండా తాగ‌డ్.. ఒకేసారి రెండు సిగ‌రెట్స్ ని కాల్చ‌డం..బ్యాగ్రౌండ్ స్కోర్‌లో అర్జున్‌రెడ్డి మ్యూజిక్ ప్లే కావ‌డం…దానికి `అర్జున్‌రెడ్డి 2` అని పెడితే బాగుంటుంద‌ని అల్లు అర్జున్ చెప్ప‌డం ఫ‌న్నీగా వుంది.

#AlaVaikunthapurramuloo - Deleted Scene | Allu Arjun, Sushanth, Pooja Hegde | Trivikram