అల్లు అర్జున్ మొదటి భార్య ఎవరు? ప‌్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో క్రేజీ హీరోగా గుర్తింపుని సొంతం చేసుకున్న బన్నీకి కేరళలో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇంకా చెప్పాలంటే తెలుగుతో పోలిస్తే కేరళలోనే బన్నీకి ఫాలోయింగ్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో. హిందీలోనూ బన్నీ సినిమాలకు క్రేజ్ వుంది. బన్నీ నటించిన చిత్రాల్నీ దాదాపుగా హిందీలో డబ్ అయ్యాయి. యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌ని సాధించాయి. సాధిస్తున్నాయికూడా.
అయితే ఇటీవల ఓ ఈవెంట్‌కి వెళ్లిన బన్నీ తన మొదటి భార్య ఎవరో చెప్పేశారట. ఇంకెవరు తను ప్రాణంగా భావించే సినిమానే అని షాకిచ్చాడట. అప్పటి నుంచి అది ఆనోట ఈ నోట పాకి అల్లు అర్జున్ మొదటి భార్య ఎవరో తెలుసా? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు నెటిజన్స్. ఇది ఇప్పుడు వైరల్ న్యూస్‌గా మారిపోయింది. ఇదిలా వుంటే బన్నీ – సుకుమార్‌ల సినిమా రెగ్యులర్ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ నెల 15 నుంచి కేరళ అడవుల్లో రెండవ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ కారణంగా తాజా షెడ్యూల్‌ని వాయిదా వేసినట్టు తెలిసింది.