యు.వి. క్రియేషన్స్, జి.ఎ.2 పక్చర్స్ పతాకాల పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నివాస్ నిర్మాతగా రూపొందించిన చిత్రం `ప్రతిరోజూ పండగే` సాయితేజ్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్నసందర్భంగా చిత్ర నిర్మాత బన్నివాస్ ఇంటర్వ్యూ…
ఈ సినిమా డిస్కషన్స్ టైమ్ లో మా అమ్మ ఫోన్ చేస్తే లిప్ట్ చేయలేకపోయాను. కథ విన్నాక నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అమ్మ ఎలా ఫీలవుతుంది అనిపించి కాల్ చేశాను. నాలాగే చాలామంది తమ వర్క్ బిజీలో పడి తల్లిదండ్రులకు సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే ఈ కథ తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని భావించి మొదలు పెట్టాం. అలా ఈ సినిమా స్టార్ట్ అవడనానికి మా అమ్మ కూడా ఓ కారణం.
వరుసగా ఐదు రోజులు నాకు కాల్ చేశారు. కానీ నేను ఎక్కువ ఫోన్ వాడను కనుక ఆ కాల్స్ గమనించలేదు. ఈ సినిమా కథ కూడా అందుకు సంబంధించినదే కావడంతో నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అమ్మ ఎలా ఫీలవుతుందని అడిగాను. బిజీగా ఉంటావని నీ మేనేజర్, ఇంట్లో వాళ్లకి కాల్ చేస్తాను అన్నారు.
పుట్టినరోజు, పెళ్ళిరోజు తరహాలో చావుని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలన్నకాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం.
సెన్సిటివ్ అంశం కనుక స్క్రీన్‌ప్లే కత్తిమీద సాము లాంటిది.
పిల్లా నువు లేని జీవితం చిత్రం తర్వాత తేజ్, నేను మళ్లీ కలిసి పని చెయ్యాలనుకున్నాం. కానీ సరైన కథ దొరకడానికి ఇంత టైమ్ పట్టింది. తేజ్ కి కూడా కథ బాగా నచ్చడంతో వెంటనే చేద్దాం అన్నాడు. తన గత చిత్రాల కంటే ఫిట్ గా కనిపించేందుకే సిక్స్ ప్యాక్ చేశాడు తప్ప కథకి అవసరమయ్యి కాదు.
నా ఆసక్తి అంతా సినిమాలపైనే. రాజకీయాలపై ఆసక్తి లేదు. ఏదైనా అంశంపై మనసుకు బాధ అనిపిస్తే సోషల్ మీడియాలో స్పందిస్తాను. అంతే తప్ప సోషల్ మీడియాను ఎక్కువ పట్టించుకోను. ఫేస్ బుక్ ఐడీని కూడా త్వరలో డిలీట్ చేయాలి అనుకుంటున్నాను.
గీతా ఆర్ట్స్2 లో కార్తికేయతో కౌశిక్ దర్శకత్వంలో `చావుకబురు చల్లగా`.. నిఖిల్ హీరోగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా, అఖిల్ హీరోగా బొమ్మరిల్లు దర్శకత్వంలో సినిమా నిర్మించనున్నాం. గీతా ఆర్ట్స్ లో జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నాం` అన్నారు.