ఆ దర్శకుడికి `ఫ్లాట్` ఇచ్చిన గీతా ఆర్ట్స్
గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మధ్య విడుదల చేసిన సినిమా `గీత గోవిందం`. రెండో రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది . విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాస్ శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
* సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ముందే ఊహించారా?
– ఊహించాం. కానీ రెండో రోజే బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకుంటే సినిమాను మేం అమ్మే వాళ్లమే కాదు. అన్నిచోట్లా ఓవర్‌ఫ్లోలున్నాయి. కేరళలో బన్నీ సినిమాలను విడుదల చేసేటప్పటి నుంచి నాకు మంచి పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే ఈ సినిమాను అక్కడ కూడా విడుదల చేశాం. కానీ ఆ రాష్ట్ర ప్రజలు వర్షాలకు అతలాకుతలమవుతున్న తీరు చూసి అక్కడ వచ్చే మొత్తం షేర్‌ను వాళ్లకే ఇద్దామనుకున్నాం. తొలి రెండు రోజుల్లో అక్కడ రూ.20లక్షల గ్రాస్ వచ్చింది.
* పరశురామ్‌తో మరో సినిమా అనౌన్స్ చేశారు?
– అవునండీ. ఆ సినిమా సెమీ మైథలాజికల్‌గా ఉంటుంది. అంటే కాంటెంపరరీ మైథలాజికల్ సినిమా అన్నమాట. ఒక హీరో, ఓ దేవుడు అనే కాన్సెప్ట్ తో వెళ్తుంది. `గోపాలా గోపాలా` తరహా సినిమా. ఆ కథ వినగానే ప్రజయ్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌ని అడ్వాన్స్ కింద పరశురామ్ పేర రాసిచ్చేశాం.
ఆ సినిమాలో హీరో ఎవరు ఏంటనేది ఇంకో వారం రోజుల్లో అనౌన్స్ చేస్తాం.
* బన్నీతో పరశురామ్ సినిమా గురించి?
– చాలా వార్తలు వస్తున్నాయి. వాటిని నమ్మకండి. బన్ని ఇప్పుడు రెండు స్క్రిప్ట్ లను ఫైనల్ చేశారు. వాటిలో ముందు ఏది ఉంటుందో రెండు వారాల్లో మేమే ప్రకటిస్తాం. మరోవైపు బన్ని తమిళ స్క్రిప్ట్ లను కూడా చాలా క్యూరియస్‌గా వింటున్నారు.
* పైరసీ గురించి చెప్పండి?
– మా సినిమా విషయంలో జరిగింది పైరసీ కాదు. అది థెఫ్ట్ కేస్. మా కేసులో ఢిల్లీ నుంచి స్పెషల్ స్క్వార్డ్ అటెండ్ అయింది. నేరగాళ్లను ఏ,బీగా విభజించాం. ఏ లో ఉన్నవాళ్లకి కఠినమైన శిక్ష పడుతుంది. బీలో ఉన్నవాళ్లు విద్యార్థులే అయినప్పటికీ కాస్త శిక్ష మాత్రం తప్పదు.