అరుంధతి 2 నుంచి తప్పుకున్న పాయల్ రాజపుత్

RX 100 సినిమా తో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజపుత్. ఈమె ఆ సినిమా తరువాత ఒకేసారి అన్ని సినిమాలు ఒప్పేసుకోకుండా ఆచి తూచి అడుగులు వేస్తోంది. అయితే ఈమె ‘అరుంధతి’ కి సీక్వెల్ అయిన ‘అరుంధతి 2 ‘ లో నటిస్తుండగా, ఈ సినిమా నుండి తప్పుకుంది.
అసలు ముందుగా ఈ ప్రాజెక్ట్ ఆమె దగ్గరకు వెళ్ళగానే ఒప్పుకున్నా పాయల్ ఎందుకు తప్పుకున్నట్టు అంటే కారణాలు ఇవీ – అనుష్క వంటి నటన చేయలేదేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేయగా, అంత సీరియస్ పాత్రను, సినిమా మొత్తాన్నీ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న ఈమె చేయగలదా అని విమర్శలు గుప్పుమన్నాయి. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుందో మరింకేమైందో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మరి మళ్ళీ అరుంధతి 2 ఎవరిని వరిస్తుందో చూద్దాం