అంప‌శ‌య్య‌పై ఏలియ‌న్ స్టార్.. స‌ర్జ‌రీల క్వీన్ కి క‌రోనా..!

అంప‌శ‌య్య‌పై ఏలియ‌న్ స్టార్.. స‌ర్జ‌రీల క్వీన్ కి క‌రోనా..!

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 50 పైగా స‌ర్జ‌రీలు చేయించుకుంది. 22 వ‌య‌సుకే ఇంత పెద్ద సాహ‌సం చేసిన వేరొక న‌టిని ప్ర‌పంచంలోనే చూడ‌లేం. కానీ ఈ అమ్మ‌డు మాత్రం అంత‌కు తెగించింది. అయితే స‌ర్జ‌రీలు అంటే ఆషామాషీనా? అవి కాస్తా విక‌టించి వికృత రూపం వ‌చ్చేసింది. అనారోగ్యంతో అతి భ‌యంక‌రంగా మారిపోయింది. చూడ‌టానికి తానేమైనా ఏలియనా? అనేంత వింత‌గా క‌నిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ స్టార్ ? అంటే .. ఇన్ స్టా స్టార్ గా పాపుల‌రైన స‌హ‌ర్ త‌బ‌ర్.

స‌హ‌ర్ త‌బ‌ర్ ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి యాంజెలీనా జోలీకి వీరాభిమాని. త‌న‌పై అభిమానంతో త‌న‌లా మారిపోవాల‌ని క‌ల‌లు గ‌నేది. దాంతోనే పిచ్చిగా ముఖానికి శ‌రీరానికి స‌ర్జ‌రీలు చేయించుకుంది. అలా 50 పైగా స‌ర్జ‌రీలు చేయించుకున్న ఈ అమ్మ‌డికి అవి కాస్తా విక‌టించి రూపం మారిపోయింది. అస‌లు ఇప్పుడే ఈ అమ్మ‌డిని గుర్తు చేసుకోవాల్సిన అస‌రం ఏమిటి? అంటే..

స‌హ‌ర్ త‌బ‌ర్ కి క‌రోనా పాజిటివ్ అని డాక్ట‌ర్లు తేల్చారు. వెంటిలేట‌ర్ పై చికిత్స అందుతోంది. మ‌రి త‌బ‌ర్ బ‌తికే ఛాన్సుందా? అంటే ఇప్పుడు డాక్ట‌ర్లు చెబుతున్న మాట ఒక‌టే. 50 స‌ర్జ‌రీలు చేయించుకుంది. అవే ఇప్పుడు త‌న‌కు ప్ర‌మాద‌క‌రంగా మార‌నున్నాయ‌ని చెబుతున్నారు. ఇక‌పోతే ఇటీవ‌ల మాన‌సికంగా కుంగిపోయిన త‌బ‌ర్ జైలు పాలైంది. దైవాన్ని దూషిస్తూ సంఘంలో హింస‌ను ప్రేరేపిస్తోంది. ఇన్ స్టాలో త‌న‌కు ఉన్న ఫాలోవ‌ర్స్ ని అవినీతికి పాల్ప‌డాల్సిందిగా కోరుతోంది. దీంతో త‌న‌ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. త‌న‌కు క‌రోనా అని తేలినా జైలు అధికారులు విడిచిపెట్ట‌లేదు. బెయిల్ కూడా రాలేదు. దీంతో జైల్లో ఉంటూనే క‌రోనాకు చికిత్స పొందుతోంది. ఎన్నో స‌ర్జ‌రీల బాధ‌ను తియ్య‌గా భ‌రించేసింది. క‌రోనాను కూడా లెక్క చేయ‌కుండా మృత్యుంజ‌యురాలు అవుతుంద‌నే అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

https://metro.co.uk/2020/04/17/instagram-star-ventilator-catching-coronavirus-prison-social-media-activity-12571052/