బాలయ్యతో చేస్తేనా..నా ‘సామి’ రంగా

(సూర్యం)

 

2003 లో  విక్రమ్ హీరోగా వచ్చిన  బ్లాక్‌బస్టర్‌ ‘సామి’ ని బాలకృష్ణతో ‘లక్ష్మి నరసింహ’గా రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఆ సినిమాకు సీక్వెల్ ‘సామి స్క్వేర్‌’ ఇంతకాలానికి రెడీ చేసి వదులుతున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని వదిలితే ఓ రేంజి రెస్పాన్స్ వచ్చింది.

 

‘మత్స్యస్వామి, కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, రావణ స్వామి, పరశురామస్వామి.. ’ అనే డైలాగ్‌తో విక్రమ్ ట్రైలర్‌ లో చెలరేగిపోయారు. అంతవరకూ బాగానే ఉంది…ఈ సినిమాని డబ్బింగ్ చేయకుండా చక్కగా మళ్ళీ బాలయ్యతోనే రీమేక్ చేయచ్చు కదా అని అభిమానులు ఆశపడుతున్నారు. బాలయ్య ఇలాంటి రౌడీ పోలీస్ క్యారక్టర్స్ ని దుమ్ము దులిపి వదులుతారని గుర్తు చేస్తున్నారు.

 

ముఖ్యంగా బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగులు కేక పెట్టిస్తాయి. ‘నాకు కావాల్సింది మూడు తలలు’ అంటూ ట్రైలర్ విక్రమ్ చెప్పిన డైలాగ్ ..బాలయ్య చెప్తే ఎలా ఉంటుందో ఊహించుకో మంటున్నారు. కొందరైతే ఇదే ట్రైలర్ లో వాయిస్ తీసుకుని బాలయ్య యాక్షన్ తో ఎడిటింగ్ చేసి వదిలే పనిలో ఉన్నారు. ఏదైనా అభిమానం అంటే అంతే.  ఇంతకీ మీరు ట్రైలర్ చూసారా…