‘సై రా’ ను కాష్ చేసుకుంటున్న హీరోయిన్

దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ నయన తార. ఆమె కధానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసిన గ్లామర్ పాత్రలు చేసినా ఆమెకు సక్సెస్ రేట్ ఎక్కువే. అందుకే నిర్మాతలు ఆమె భారీ పారితోషకాన్ని, ఆమె షరతులను పట్టించుకోకుండా ఆమె డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

తాజాగా నయన తార చేసిన ‘సై రా’ కూడా పెద్ద విజయం సాధించింది. అయితే ఈ క్రెడిట్ మొత్తాన్ని అందులో ‘లక్ష్మి’ పాత్ర చేసిన తమన్నా కొట్టేస్తోంది. కారణం, ప్రచార కార్యక్రమాలకు నయన్ రాకపోవడం, తమన్నా హాజరు కావడం. దాంతో నిర్మాతల దృష్టి తమన్నా పైనే ఉంది.

తక్కువ పారితోషకం, అంకిత భావం, సినిమా ప్రచారానికి రావడం తమన్నాకి కలిసొచ్చే అంశాలు. దాంతో ఇక నయన్ కంటే తమన్నా ను తీసుకుంటే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారట సినీ పెద్దలు.