‘సైరా’కు ఫర్మిషన్ వచ్చిందా
ఈ రోజున ఏ పెద్ద సినిమాకు అయినా స్పెషల్ షోలే డబ్బులు తెచ్చి పెట్టేవి. అయితే వాటికి ప్రభుత్వాలు పరిష్మన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ కలెక్ట్ చేసేది మొదట వారంలోనే. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా కు కూడా ప్లాన్ చేసారు. అయితే ఇంకా ఫర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా రాలేదని తెలుస్తోంది. అటు తెలంగాణా ప్రభుత్వం ఏ సినిమా కు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వటం లేదు. మరో ప్రక్క ఆంధ్రాలో పవన్ తో ప్రభుత్వానికి ఉన్న విభేధాలతో ఫర్మిషన్ వస్తుందా అనే సందేహాలు నెలకొని ఉన్నాయి.
‘సైరా’ విడుదలకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలు వేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ షోస్ కన్ఫర్మ్ చేసినట్లుగా టిక్కెట్లు ఇచ్చేస్తున్నారు. చాలా చోట్ల వేకువజామున 3 గంటల నుండే స్పెషల్ షోలు వేస్తారని తెలుస్తోంది. అంతేగాక అదనపు షోస్ వేయడానికి అనుమతులు కూడా తీసుకుంటున్నారట. అంటే రోజుకు ఐదు షోల చొప్పున చిత్రం ప్రదర్శితం కానుంది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకల్లో దాదాపు అన్ని చోట్ల ఈ షోస్ ఉండనున్నాయి. చిత్రానికున్న డిమాండ్, హైప్ రీత్యా ప్రభుత్వం కూడా స్పెషల్, అదనపు షోలకు అనుమతులిచ్చే అవకాశం ఉంది.
చెన్నై సిటీలో సైతం భారీ స్థాయిలో స్పెషల్ షోస్ వేయటానికి రంగం సిద్దమైంది. అలాగే చెన్నైలోని తెలుగు ప్రేక్షకుల కోసం మొదటి రోజు మొత్తం ఉదయం 8 గంటల స్పెషల్ షోలు 50 ఎర్పాటయ్యాయి. ఇవి కూడా కేవలం తెలుగు వెర్షన్ వరకే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇన్ని స్పెషల్ షోలు వేయలేదు. రిసెంట్ గా విడుదలైన ‘సాహో’కి కూడా 30 స్పెషల్ షోలు వేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ‘సైరా’ కొత్త రికార్డ్ నెలకొల్పినట్లే.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాట విడుదల చేయనుంది. విజయ్ సేతుపతి, నయనతార లాంటి బడా స్టార్స్ ఇందులో నటించడంతో తమిళ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మంచి అంచనాలున్నాయి. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.