ఏ అత్త-కొడలికి అంత సులువుగా ఏదీ పొసగదు. అదీ ఒకే ఇంట్లో కలిసి ఉంటే ఆ వార్ ముందు వరల్డ్ వారే చిన్నబోతుంది. ఎందుకంటే అత్త-కోడలి మధ్య వివాదం వస్తే ఆ స్థాయిలో రాజుకుపోతుంది. అందుకే పెళ్లయిన వెంటనే ఎవరి కుంపటి వాళ్లు పెట్టుకోవడం ఓ సంప్రదాయంగా మారింది. ఎంత డిజిటల్ యుగమైనా అత్త-కోడలి మధ్య వార్ మాత్రం కామన్ అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. జయాబచ్చన్- ఐశ్వర్యా రాయ్ లాంటి టాప్ రేంజ్ అత్తా కోడళ్లకే ఈ తిప్పలు తప్పలేదని కథనాలొచ్చాయి. తాజాగా కరోనా కారణంగా టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ సెలబ్రిటీ కుటుంబంలో అత్త-కోడలి మధ్య వార్ పై గుసగుసలు వినిపిస్తున్నాయి లాక్ డౌన్ నేపథ్యంలో అత్త ముందు కోడలు .. కోడలి ముందు అత్త ఒకరికొకరు ఎదురుగా కనిపిస్తుండడం చిక్కు తెచ్చి పెట్టింది.
అసలే కరోనా దెబ్బకు పనోళ్లు ఇంటికి రావడం లేదు. మరి వంట వండడం కిచెన్ శుభ్రపరచడం.. అత్త మామలకు సేవలు చేయడం వగైరా వగైరా ఎంత సెలబ్రిటీ కోడలికైనా తప్పవు కదా! అక్కడే వచ్చింది చిక్కు. ఆ సెలబ్రిటీ అత్త కోడలి మధ్య వంట విషయంలో యుద్ధం మొదలైందిట. రీజన్ సిల్లీగా ఉన్నా! ఇదే నిజం. సాధారణ అత్త-కోడలి మధ్య తలెత్తినట్టే వాళ్లిద్దరి మధ్యనా వివాదంగా మారిందట. ఎప్పుడూ షూటింగ్ ల పేరుతో ఔట్ డోర్ లో ఉండే కోడలు గారికి సమయం దొరకడంతో ఒక రోజు గరిట పట్టి చేతివాటం చూపించిందిట. ఆ వంటలు అదిరిపోవడంతో అత్త లాక్ డౌన్ ఉన్నంత కాలం వంటలు నువ్వే చేయాలని ఆర్డర్ వేసిందిట. దీంతో ఇవేం తిప్పలు బాబోయ్! అంటూ సదరు కోడలు చేతులెత్తేసిందట. మంటెత్తి పోయిన కోడలు రోజూ చేసేందుకు నేనెవరనుకుంటున్నావ్? అంటూ గొడవకు దిగిందట అత్తపై. ఇంట్లో నలుగురైదుగురు ఉన్నప్పుడు రోజుకొకరు చొప్పున చేయాలి! అని వాటాలు వేసిందట.
దీంతో అత్తకు చిర్రెత్తుకొచ్చింది. సాధారణ రోజుల్లో వంట మనిషితో కలిసి నేనే అన్ని పనులు చూసుకుంటా. ఈ లాక్ డౌన్ ఉన్నంత కాలమైనా వంట చేయలేవా? సంపాదిస్తున్నానని పొగరా? అంటూ నిలదీసిందిట. విషయం సీరియస్ అవ్వడంతో మధ్యలో మామగారు..ఆ కోడలి భర్త కల్పించుకుని ఆ సమస్యకు ఓ పరిష్కారం చూపించారుట. చూసారా? కంటికి కనిపించని వైరస్ బాడీ లోపలే కాదు..బయట కూడా తినేయడం ఎలా మొదలు పెట్టిందో! మాయదారి కరోనా ఇన్ని గొడవలు పెడుతుందని ఎవరూ అనుకోలేదు. ముఖ్యంగా ఎంతో డీసెంట్ ఫ్యామిలీగా చెప్పుకునే ఆ ఇంట్లోనూ అలానే గొడవ మొదలైంది మరి.