‘సాహో ‘ ఫ్లాప్ అన్నందుకు ఆ రివ్యూ రైటర్ కు టార్చర్ !

సాహో భరించలేని చిత్రం అంటావా,నీ అంతు చూస్తాం

తమ హీరో సినిమా ని తక్కువ చేసి మాట్లాడితే ఫ్యాన్స్ తట్టుకోలేరు. అయితే సాధారణంగా రివ్యూ రైటర్స్ ఆ ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కోసారి ఆ రివ్యూ కూడా మరీ దారుణంగా ఇస్తే …ఫ్యాన్స్ ను ఆపటం ఎవరి వల్లా కాదు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ రివ్యూ రైటర్ తరుణ్ ఆదర్శ్ పరిస్దితి అదే.

రిలీజ్ రోజు తరణ్ ఆదర్శ్ సాహో చిత్రంలో ఇచ్చిన రివ్యూ పట్ల ప్రభాస్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభాస్ ఎంతో ఇష్టపడి, కోట్లు ఖర్చు పెట్టి మరీ నటించిన సాహోకు ఒక్క స్టార్ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో తరణ్ ఆదర్శ్ కు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి తోడు సాహో హిందీ వెర్షన్ బాగా పికప్ అయ్యింది. ఆ కలెక్షన్స్ ని చూపి నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఫ్లాప్ చిత్రంగా ముద్రపడిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి 4.5 స్టార్ రేటింగ్ ఇవ్వడం తరణ్ ఆదర్శ్ కే చెల్లిందంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. మరొకరు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన మరో చిత్రం భరత్ ఓ డిజాస్టర్ గా నిలిస్తే, ఆ సినిమాకు 4 స్టార్లు ఇచ్చి స్మాష్ హిట్ అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్న ట్వీట్ ను ఓ అభిమాని రీట్వీట్ చేశాడు.

నీకు సౌతిండియా సినిమాలు నచ్చవని, ఎక్కడ బాలీవుడ్ సినిమాలను సౌత్ సినిమాలు అధిగమిస్తాయోనని నీకు అసూయ అంటూ మరో నెటిజన్ ఘాటుగా కౌంటర్ వేసాడు. పేమెంట్ వర్కౌట్ అయితే అది ఎమోషనల్ జర్నీనా, పేమెంట్ వర్కౌట్ కాకపోతే భరించలేని జర్నీనా అంటూ మరికొందరు ఏకిపారేశారు. భరత్ చిత్రానికి తరణ్ ఆదర్శ్ ఎమోషనల్ జర్నీ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు సాహో చిత్రానికి భరించలేని చిత్రం అంటూ రివ్యూ ఇచ్చాడు.