‘సాహో’పై ఇంత దిగుజారుడు రాతలా,సిగ్గుందా?: నారా లోకేశ్‌

‘సాహో’పై ఇంత దిగుజారుడు రాతలా,సిగ్గుందా?: నారా లోకేశ్‌

 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొంది రిలీజ్ కు రెడీ అయిన చిత్రం ‘సాహో’ . తెలుగుతో పాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఫ్యాన్స్ మధ్య వార్స్ సోషల్ మీడియాలో జరుగుతూ నెగిటివ్ పోస్ట్ లు అక్కడక్కడా కనపడుతున్నయి. అయితే అవి కామనే కానీ …తెలుగు దేశం నేతలు కొందరు సాహో మీద దుష్పచారం చేయమని సోషల్ మీడియా టీమ్ కు ఆదేశించారని ఓ వెబ్ సైట్ కథనం అల్లింది.

సాహో ప్రమోషన్స్ నిమిత్తమై తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిన ప్రభాస్ అక్కడ వైసీపీ అధినేత జగన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. దీంతో అది జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ప్రభాస్‌పై, సాహో సినిమాపై నెగెటివ్ ప్రచారాలు చేస్తున్నాయని ఆ వెబ్ సైట్ రాసుకొచ్చింది. ఈ విషయమై టీడీపీ నాయకుడు నారా లోకేష్ దృష్టికి వచ్చింది. దాంతో ఆయన ఓ రేంజిలో ఫైర్ అవుతూ. సెన్సేషనల్ ట్వీట్ చేశారు.

 ప్రపంచంలోని ప్రభాస్‌ అభిమానులు అందరి లాగానే  తాను కూడా ‘సాహో’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇంతగా దిగజారి వార్తలు రాయడం సరికాదని సదరు వెబ్‌సైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి తప్పుడు వార్త రాసిన వ్యక్తి సిగ్గుపడాలి. విద్వేషపూరితమైన ప్రచారం వల్ల వచ్చిన డబ్బులతో ఎలా భోజనం చేయగలుగుతున్నారు?’.

‘‘సాహో’ను భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ప్రపంచంలోని అందరు ప్రభాస్‌ అభిమానుల్లానే నేనూ ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను. ప్రభాస్‌ అభిమానులు, తెదేపా మద్దతుదారులు సినిమాను చూసి ఇలాంటి తప్పుడు వార్తల్లో నిజంలేదని చెప్పండి’ అని ఆయన వరుస ట్వీట్లు చేశారు.