Home Tollywood సంక్రాంతికి బోర్ కొట్టించిన హీరో?

సంక్రాంతికి బోర్ కొట్టించిన హీరో?

సంక్రాంతి బ‌రిలో మొత్తం నాలుగు చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించి మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ `ద‌ర్బార్‌` చిత్రం. కాస్త ప‌ర్వాలేద‌నిపించుకుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. కొంత మంది దీన్ని క్లాస్ హిట్‌గా చూస్తున్నారు. మూడ‌వ చిత్రం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈచిత్రం హిట్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే ఇదికూడా ఒక‌ర‌కంగా మిక్స‌డ్ టాక్ అనే చెప్పాలి.

ఈ చిత్రం కూడా కొంత‌మందికి న‌చ్చింది. మ‌రికొంత మంది ప‌ర్వాలేదంటున్నారు. స‌రిలేరు మాస్ హిట్ అయితే ఇది క్లాస్ హిట్ అని భావిస్తున్నారు. ఇక‌పోతే ఆఖ‌రి చిత్రం నాలుగో చిత్రం పండ‌గ‌రోజు విడుద‌లైన చిత్రం నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ స‌తీష్‌వేగ్నేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `ఎంత‌మంచివాడ‌వురా` ఈ చిత్రం మాత్రం ఈ పండ‌గ‌కి అస్స‌లు ఆక‌ట్టుకోలేక‌పోయింది. కళ్యాణ్ రామ్… ఫ్యామిలీ మీద ఎక్కువగా దృష్టి పెట్టి సెంటిమెంట్ సీన్లు, ఎమోషన్లు సీన్లు ఓవర్ గా చూపించాడు సినిమా బోర్ కొట్టేసింది. సీరియ‌ల్‌ను త‌ల‌పించింది. ద‌ర్శ‌కుడు స‌తీష్ పండ‌గ సీజ‌న్ కాబ‌ట్టి ఎక్కువ‌గా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకునే దిశ‌గా వెళ్ళాడు కాని.. తీసేకున్న‌కాన్సెప్ట్ మ‌రీ బోరింగ్ అనిపించింది. `వెల్ ఎమోష‌న్స్ స‌ప్లైయ‌ర్‌` అన్న లాజిక్ అస్స‌లు వ‌ర్క్ అవుట్ కాలేదు. ఎంత సినిమా అయినా స‌రే ఎక్క‌డో ఒక‌చోటైనా లాజిక్ చూస్తారు జ‌నాలు.

మ‌రీ లాజిక్ మిస్ కావ‌డంతో ఎవ్వ‌రూ ఈ చిత్రాన్ని పెద్ద‌గా ఆద‌రించ‌లేదు. అంతేకాక కామెడీ స‌రిగా లేదు. పాట‌లు ఏదో ప‌ర్వాలేద‌నిపించు కున్నాయి. ఇక హీరో హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు కూడా పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ‌ట్టు ఏమీ లేవు. దీంతో పాపం క‌ళ్యాణ్‌రామ్ అంత మంచివాడు అనిపించుకోలేక‌పోయాడు. ఇకపోతే క‌ళ్యాణ్ ఎంచుకునే క‌థ‌లు ఎందుకోగాని పెద్ద‌గా హిట్ కావ‌డం లేదు. మంచి హైట్‌.. అందం టాలెంట్ అన్నీ ఉన్నా కూడా క‌ళ్యాణ్‌కి మాత్రం టైం కలిసిరావ‌డం లేదు. ఇక‌పోతే క‌ళ్యాణ్‌రామ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల‌వ్వ‌డం ఇదే మొద‌టిసారి దీన్ని బ‌ట్టి ఆయ‌న‌కు సంక్రాంతి పెద్ద‌గా క‌లిసిరాలేద‌నే చెప్పాలి.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

క్రాక్ హిందీ రీమేక్ రైట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ డైలీ కోటికి తక్కువ రావడం లేదు. ఇక రానున్న రోజుల్లో థియేటర్స్...

మరో సినిమాతో బిజీగా మారనున్న మెగాస్టార్.. డేట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

Latest News