షాకింగ్ న్యూస్: ‘ఇస్మార్ట్ శంక‌ర్’ రీరిలీజ్

‘ఇస్మార్ట్ శంక‌ర్’ ని మళ్లీ థియోటర్స్ లో చూడచ్చు

ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా రీ రిలీజ్ చేసే పరిస్దితి కనపడటం లేదు. సెన్సేషన్ హిట్ సినిమాలు సైతం సైలెంట్ గా ఉంటున్నాయి. ఎందుకంటే హిట్ సినిమాలు టీవిల్లో, అమెజాన్ ప్రైమ్ లో కనపడుతూంటే రీరిలీజ్ కోసం ఎవరు థియోటర్ కు వెళ్తారు అనే కాన్సెప్ట్ తో నిర్మాతలు ధైర్యం చేయరు.కానీ పూరి అందరి లాంటి వాడు కాదు. తన సూపర్ హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ ని రీ రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28 న పూరి జగన్నాథ్ పుట్టిన రోజున ఈ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు.

ఇస్మార్ట్ శంకర్ రాకముందు పూరి జగన్నాథ్ ఓ పెద్ద ఫెయిల్యూర్ డైరక్టర్. గత కొంత కాలంగా వరస ఫ్లాఫ్ లతో పూరీ జగన్నాథ్ ఫామ్ కోల్పోయాడనే చెప్పాలి. అయితే ఓ టైమ్ లో రియలైజ్ అయ్యి, తనకు నచ్చినట్లు కాకుండా జనాలకు నచ్చేలా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీశాడు. అయినా ఈ సినిమాకు పెద్ద క్రేజ్ రాలేదు. దానికి తోడు రామ్ కు హిట్స్ లేకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దాంతో ఈ సినిమాకు కేవలం 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది.

జులై 18న విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్ గా నిలిచింది. పూరి మార్క్ డైరక్షన్ తో బాటుగా రామ్ ఎనర్జీ, హీరోయినుల గ్లామర్ షో అంతకు మించి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ సినిమా అన్ని ఏరియాలలో భారీ లాభాలను తెచ్చింది.