శ్రీకాంత్ ను ఆపరేషన్ 2019 గట్టెక్కిస్తుందా ?

హీరో శ్రీకాంత్ 1991లో  పీపుల్స్   ఎన్ కౌంటర్ సినిమాతో నటుడుగా పరిచయం అయ్యాడు . ఈ 27 సంవత్సరాల్లో 125 సినిమాలకు పైగా నటించాడు .

ఇప్పటికీ హీరోగానే నటిస్తున్నాడు కానీ ఆయన సినిమాలు ఆడటంలేదు , వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే వుంది . ఇక హీరోగా శ్రీకాంత్ పని అయిపోయిందని అంటున్నారు . జగపతి బాబులాగా విలన్ గా మారి పోవలసిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు .  శ్రీకాంత్ మొదట్లో విలన్ గానే నటించాడు కాబట్టి మళ్ళీ విలన్ గా చెయ్యడానికి అభ్యన్తరం ఉండక పోవచ్చు .

గత కొన్నాళ్లుగా శ్రీకాంత్  నటించిన  వేట, నాటుకోడి, జల్సారాయుడు , మెంటల్ పోలీస్, టెర్రర్ , సైరైనోడు , శరణం ,ఢీ అంటే ఢీ  మొదలైన సినిమాలు ఏ  మాత్రం అతని కెరీర్ కు ఉపయోగ పడలేదు . మొండోడు అనే సినిమా రిలీజ్ కూడా కాలేదు .

ఇప్పుడు రాజకీయాలపై తీసిన “ఆపరేషన్ 2019” సినిమా డిసెంబర్ 1న విడుదలకాబోతుంది . 2007న శ్రీకాంత్ “ఆపరేషన్ దుర్యోధన ” అనే సినిమాలో నటించాడు . ఆ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది . అది రాజకీయాలపై తీసిన సినిమా . ఆ సినిమా ప్రేరణగా ఇప్పుడు ఆపరేషన్ 2019 తీసినట్టుగా అనిపిస్తుంది .

రాజకీయ విలువల గురించి  , నీతివంతమైన రాజకీయాలు , ఓటు ప్రాధాన్యత మొదలైన అంశాలు వుంటాయని ,శ్రీకాంత్  రాజకీయ నాయకుడు పాత్రలో నటిస్తున్నాడు . ఈ సినిమాను కరణం  బాబ్జీ దర్శకత్వంలో రూపొందించారు . సరిగ్గా  తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు విడుదల చెయ్యబోతున్నారు .

ఒక పాటలో చంద్ర శేఖర్ రావు ను గుర్తుకు తెచ్చాడని అంటున్నారు . సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు . అదీ ఎన్నికలు మాంచి వూపు మీద వున్నప్పుడు విడుదల చేస్తున్నారు . ఈ సినిమా అయినా శ్రీకాంత్ ను నిలబెడుతుందో లేదో చూడాలి .