టాలీవుడ్ హీరోలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు. తమ సినిమాల ప్రమోషన్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ హడావుడి చేస్తుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఆడియో ఫంక్షన్ లో సినిమాల విజయ యాత్రలు అంటూ చేసే హడావుడికి అంతా ఇంతా కాదు.
సినిమాల కలెక్షన్లు పెంచుకునేందుకు.. తమ మార్కెట్ పెంచుకునేందుకు హడావుడి చేస్తూ భారీగా బిజినెస్ చేసుకునేందుకు మాత్రం వాళ్లకు టైం ఉంటుంది. కానీ తమ అభిమాన హీరోలు తమను అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మాత్రం ఎవ్వరూ పట్టించుకునే నాధులే ఉండరు. ఎవరికీ పట్టదు వరదలు వచ్చినా.. తుఫాను వచ్చినా ఎన్నో ప్రమాదాలు జరిగినా కొందరు హీరోలు మాత్రం తూతూ మంత్రంగా స్పందిస్తూ చేతులు దులిపేసుకున్నారు.
మరి కొందరు హీరోలు మాత్రం సోషల్ మీడియాలో రెండు లైన్లు బాధపడుతున్నాను అంటూ చిన్న పోస్ట్ పెట్టేసి మా పని అయిపోయింది అనుకుంటారు. కానీ నిజంగా వాళ్ళు ఆ సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించి తమ అభిమానులను కలిసి సాయం చేసే వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు . వాళ్లకు అంత సమయం కూడా ఉండదు.
“గతంలో చాలా వరదలు చూశాము.. 1986 వరదలు మా జీవితాలను అతలాకుతలం చేశాయి. మళ్లీ 2006లో వచ్చిన వరదలు విలయం సృష్టించాయి. అయినా అప్పట్లో కూడా ఇంత నష్టం చూడలేదు. వరదలు వస్తే మూడు, నాలుగు రోజుల్లో పోయేవి. కానీ ఇటీవలె వచ్చిన వరదలకు 12 రోజులుగా నీటిలో నానిపోతూ, పశువులు, సామాన్లు వదిలి వెళ్లలేక వరద నీటిలోనే ఉంటూ తూర్పు గోదావరి జిల్లా వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. దేవిపట్నం మండలంలో ఉన్న పూడిపల్లి సినిమా షూటింగులకు ప్రసిద్ధి. చిరంజీవి హీరోగా నటించిన ఆపద్బాంధవుడు, బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, అల్లరి నరేష్ హీరోగా నటించిన ప్రాణం వంటి చాలా సినిమాలు ఈ గ్రామంలో షూటింగ్ జరుపుకున్నాయి.
దేవిపట్నం మండలంలో ఉన్న పూడిపల్లి సినిమా షూటింగులకు ప్రసిద్ధి. చిరంజీవి హీరోగా నటించిన ఆపద్బాంధవుడు, బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, అల్లరి నరేష్ హీరోగా నటించిన ప్రాణం వంటి చాలా సినిమాలు ఈ గ్రామంలో షూటింగ్ జరుపుకున్నాయి. ఆ గ్రామ పరిస్థితి బాగోని సమయంలో మాత్రం ఎవ్వరూ కనీసం స్పందించలేదు. కేవలం సినిమాల్లో మాత్రమే హీరోలా. బయట ఎటువంటి చిన్న సహాయం కూడా చేయలేరా అని కొందరు వాపోతున్నారు.