వేణుమాధవ్ ఏమన్నా దాచారా, ఆస్ది ఎంత
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాలమరణం తెలుగు పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపధ్యంలో ఆయన ఆర్దిక పరిస్దితి ఏమిటనే ప్రశ్న అందరిలో కలిగింది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వేణు మాధవ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా.. ఆయనకు ఆస్తులు ఉన్నాయా లేదా.. అని అందరూ మాట్లాడుకుంటు
న్నారు. దానికి తోడు ఆయన చనిపోయిన కాసేపటికే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చి వేణు మాధవ్ హాస్పిటల్ బిల్ కట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతో కనీసం వేణు మాధవ్ హాస్పిటల్ బిల్ కూడా కట్టలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడా అని చర్చ మొదలైంది.
అయితే ఇలాంటి డౌట్స్ కు ఆన్సర్ ని కొన్ని రోజుల కింద ఓ ఇంటర్వ్యూలో వేణునే ఇచ్చాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పాడాయన. అంతేకాదు అదే ఇంటర్వ్యూలో తనకు ఎక్కడెక్కడ ఏయే ఆస్తులున్నాయో చెప్పుకొచ్చాడు వేణు మాధవ్. కొన్నేళ్లుగా ఈయన హైదరబాద్‌లోని మౌలాలిలో సెటిల్ అయిపోయారు.
అలాగే తనకు ఈసీఐఎల్ నుంచి మౌలాలి వరకు తనకు పది ఇళ్లు ఉన్నాయని అప్పట్లో తెలిపాడు వేణు. అలానే కరీంనగర్ జిల్లాలో 10 ఎకరాల వరకు తనకు వ్యవసాయ భూములున్నట్లు చెప్పాడు. ఆర్థికంగా తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్పాడు వేణు మాధవ్.
సూర్యపేట జిల్లా కోదాడలో 1979 డిసెంబర్ 30న జన్మించారు. వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.
ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘మాస్’ చిత్రాలు కమెడియన్‌గా పేరు తెచ్చి పెట్టాయి.
2006లో వెంకటేశ్ హీరోగా.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మి’ సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ ‘నంది’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన చివరిగా ‘రుద్రమదేవి’ చిత్రంలో కనిపించారు.