విక్ర‌మ్‌ని కూడా వ‌ద‌ల‌డం లేదు!

పుకార్లు పుట్టించే వాళ్లు సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతున్న హీరో విక్ర‌మ్‌ని కూడా వ‌ద‌ల‌డం లేదు. విభిన్న‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన హీరో విక్ర‌మ్‌. కొత్త‌ద‌నాన్ని కోరుకునే వారి కోసం విక్ర‌మ్ త‌న కెరీర్‌లో చాలా ప్ర‌యోగాలే చేశాడు. క‌మ‌ల్‌ని మించి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించాల‌ని ప్ర‌త్నించి ప్రస్తుతం రేస్‌లో చాలా వెన‌క‌బ‌డ్డాడు. దీనికి తోడు విక్ర‌మ్ కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో వచ్చినా అవి ప్రేక్ష‌కుల్ని ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి.

ప్ర‌స్తుతం గౌత‌మ్ మీన‌న్‌తో చేస్తున్న `ధృవ న‌క్ష‌త్రం` ఇప్ప‌టికీ రిలీజ్‌కి నోచుకోవ‌డం లేదు. ఇదిలా వుంటే విక్ర‌మ్ `కోబ్రా, పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో వున్నాయి. అయితే ఈ సినిమాల త‌రువాత విక్ర‌మ్ న‌ట‌న‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నాడ‌ని, త‌న త‌న‌యుడు ధృవ్ కెర్‌ని చ‌క్క‌దిద్దే పనులు మాత్ర‌మే చూసుకుంటార‌ని జోరుగా పురార్లు వినిపించ‌డం మొద‌లైంది. ముందు వీటిని లైట్‌గా తీసుకున్నా అవి కెరీర్‌పై ప్ర‌భావం చూపించే విధంగా వైర‌ల్ అవుతుండ‌టంతో విక్ర‌మ్ త‌న పీఆర్ టీమ్‌ని రంగంలోకి దింపాడు.

వెంట‌నే మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేయించాడు. విక్ర‌మ్ న‌ట‌న‌కు గుడ్ బై చెప్ప‌డం లేద‌ని, కొంత మంది మ‌తిలేని వాళ్లు ఇలాంటి నిరాధార‌మైన రూమ‌ర్స్‌ని పుట్టిస్తున్నారని పీఆర్ టీమ్ ఘాటుగా స్పందించింది. ఈ వివ‌ర‌ణ‌తో అయినా విక్రమ్‌పై రూమ‌ర్స్ పుట్టించే వాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాలి.