లాక్ డౌన్ నేపథ్యంలో చాలా సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 నుంచి మే 3 వరకూ మళ్లీ లాక్ డౌన్ ప్రకటించడంతో రిలీజ్ ప్లానింగ్ లు మారాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మే 3 తో గనుక లాక్ డౌన్ ఎత్తేస్తే ముందుగా రిలీజ్ అయ్యే సినిమాలివే నంటూ ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన వి , ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ , మాస్ రాజా రవితేజ నటించిన క్రాక్ చిత్రాలు జులైలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న వకీల్ సాబ్ ఆగస్టులో , విక్టరీ వెంకేటేష్ నటిస్తోనన నారప్ప సెప్టెంబర్ లో , నందమూరి బాలకృష్ణ 106వ చిత్రం అక్టోబర్ లో రిలీజ్ కానున్నాయని సమాచారం. ఇంకా ఈ మధ్యలో పలు చిన్న సినిమాలు, అనువాద చిత్రాలు డేట్లు లాక్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ లు అన్ని అప్పటి పరిస్థితులను బట్టి ఆధార పడి ఉంటాయి. కరోనా వైరస్ నానాటికి విజృభింస్తోంద తప్ప తగ్గు ముఖం పట్టలేదు. అయితే ఇలా లాక్ డౌన్ ఎన్నాళ్లు కొనసాగించగలరు? కొనసాగిస్తే తలెత్తే పరిణామాలను కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో దశల వారిగా లాక్ డౌన్ పై ఆంక్షలుంటాయని ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ సోర్స్..ప్రభుత్వం అధికారలు అంచనాలను బట్టి సదరు హీరోలు రిలీజ్ లు ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.