ర‌ష్మిక‌కు కిస్ పెట్టి షాకిచ్చిన అభిమాని!

Rashmika Mandanna

అభిమానం హ‌ద్దులు దాటుతోంది. న‌చ్చిన తార‌లు క‌నిపిస్తే ఎలాగైనా వారితో సెల్ఫీలు దిగాల‌ని, ఫొటోలు తీసుకోవాల‌ని ఫ్యాన్స్ ఎగ‌బ‌డుతున్నారు. దీంతో సెల‌బ్రిటీల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. తాజాగా ఓ అభిమాని హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌డం క్రేజీ బ్యూటీ ర‌ష్మిక‌ను షాక్ కు గురిచేసింది. ఇటీవల వ‌రుస విజ‌యాల‌తో క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అభిమానులు కూడా ఎక్కువ‌య్యారు. ర‌ష్మిక ఎక్క‌డికి వెళ్లినా అభిమానుల్ని కంట్రోల్ చేయ‌డం ఆమె వ్య‌క్తిగ‌త సిబ్బందికి ఇబ్బందిగా మారింది.

తాజాగా ఓ అభిమాని ఏకంగా సెల్ఫీ అంటూ వ‌చ్చి ర‌ష్మిను కిస్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లోని కూర్గ్‌లో వున్న ర‌ష్మిక నివాసంలో ఐటీ దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమెని క‌ల‌వ‌డానికి అభిమానులు అధిక సంఖ్య‌లో ర‌ష్మిక ఇంటికి వ‌చ్చార‌ట‌. అందులో ఒక వ్య‌క్తి సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నంచి ఏకంగా ర‌ష్మ‌క‌ని ప‌ట్టుకుని ముద్దు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. విష‌యం గ్ర‌హించిన అభిమాని అక్క‌డ వుంటే బ‌డితే పూజ త‌ప్ప‌ద‌ని పారిపోయాడు. ఒక్క‌సారిగా షాక్ గురైన సిబ్బంది తేరుకునే లోపే కిస్ చేసిన వ్య‌క్తి అక్క‌డి నుంచి పారిపోతున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోని ఓ వ్య‌క్తి టిక్ టాక్ లో పోస్ట్ చేయ‌డంతో అది వైర‌ల్ అవుతోంది.