ర‌కుల్ వర్సెస్ త‌మ‌న్నా.. స‌డెన్‌గా క్రేజీ ఆఫ‌ర్స్

టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించిన భామ‌లుగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. అందాల‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రూ బాలీవుడ్ లో ఎందుక‌నో స‌క్సెస్ కాలేదు. మిల్కీతో పోలిస్తే ర‌కుల్ ముంబై ప‌రిశ్ర‌మ‌లో కొంత బెట‌ర్.

తాజాగా బాలీవుడ్ లో ర‌కుల్ ప్రీత్‌కి వేశ్య‌గా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశం అందుకుంద‌ని తెలిసిందే. ఇంత‌కుముందు మ‌ర్జ‌వాన్ చిత్రంలోనూ ర‌కుల్ ఈ త‌ర‌హా పాత్ర‌ను పోషించింది. ఇక త‌న కొలీగ్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా వైపు నుంచి ర‌కుల్ కి అంతో ఇంతో ఆఫ‌ర్ల ప‌రంగా సాయం అందుతోంద‌ట‌. ఇక ర‌కుల్ వేశ్య‌గా న‌టించే సినిమాకి ద‌ర్శ‌కనిర్మాత‌లు ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ స‌మ‌యాన్ని దిల్లీలో కుటుంబంతో స్పెండ్ చేసిన ర‌కుల్ మ‌రోవైపు హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ వైపు సీరియ‌స్ గానే చూస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అలాగే మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ జ‌ర్నీలో అంద‌రు స్టార్ హీరోల‌తో న‌టించినా శింబు స‌ర‌స‌న చేసింది లేదు. ఏఏఏ అనే మూవీలో శింబు స‌ర‌స‌న మెరిసింది. ఆ త‌ర్వాత ఛాన్సుల్లేవ్. తాజాగా త‌మిళ యంగ్ ట్యాలెంట్ శింబు స‌ర‌స‌న ఈ అమ్మ‌డు మ‌రో ఆఫ‌ర్ అందుకుంద‌ని తెలిసింది. ఇటు తెలుగు అటు హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో మిల్కీ కెరీర్ ఏమంత సాగ‌లేదు. అటు త‌మిళంలో మాత్రం ఆఫ‌ర్లు అందుకుంటోంది. ర‌కుల్ .. త‌మ‌న్నా కెరీర్ కీల‌క మ‌లుపులో ఇవి క్రేజీ ఆఫ‌ర్స్ అనే చెప్పాలి.