కింగ్ నాగార్జున ఒకప్పటి హిట్ సినిమాల్లో ఒకటైన మన్మధుడు కి సీక్వెల్ గా మన్మధుడు 2 వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 9 న విడుదల అవుతోంది. అందువల్ల నాగార్జున, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు.
ఈ సినిమాలోని ఒక పాటను రేడియో ఎఫ్.ఎం, రెడ్ ఎఫ్.ఎం ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాతల్లో నాగార్జున ఒకరు. ఈ సినిమాలో లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిషోర్ మొదలైన వారు ఉన్నారు.