రామ్ గోపాల్ వర్మకు మరో షాక్

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై తెలుగు తమ్ముళ్లు , నాయకులూ నిరసనలు తెలియజేస్తున్నారు , పోలీస్ కేసులు పెడుతున్నారు. తాజాగా మరో సంగతి వెలుగులోకి వచ్చింది . ఎన్ .టి . రామా రావు కుమారుడు నందమూరి రామకృష్ణ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” చిత్రాన్ని సెన్సార్ చేసే ముందు తమకు చూపించి అనుమతి తీసుకోవాలని కేంద్ర సెన్సార్ అధికారి  ప్రసూన్ జోషిని  కోరినట్టు తెలిసింది . ఈ మేరకు రామకృష్ణ ఒక లేఖను ప్రసూన్ జోషికి వ్రాశారట .

తమ తండ్రి జీవిత చరిత్ర తో రామ్ గోపాల్ వర్మ  దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా పై తమకు అనుమానాలు ఉన్నాయని , కాబట్టి ఆ సినిమా తమ అనుమతి లేకుండా సెన్సార్ చెయ్యవద్దని వ్రాసినట్టు తెలిసింది .

జీవిత చరిత్ర చిత్రంగా తీసేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలట. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామారావు కుటుంబ సభ్యులు అనుమతి ఇస్తారా ? అభ్యన్తరాలు చెబుతారా ? ఏమి జరుగబోతోంది ? ఈ లేఖపై  ప్రసూన్ జోషి ఎలా స్పందిస్తాడో చూడాలి ?