Gallery

Home Tollywood రాక్ చేస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు సెకండ్ సాంగ్‌

రాక్ చేస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు సెకండ్ సాంగ్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్‌ షెడ్యూల్‌తో నవంబర్‌ నెలాఖరు వరకు ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి రానుంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్, ఫాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్, డిసెంబర్ 9న (సోమవారం) ఈ రోజు సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫామిలీ మెలోడీ సాంగ్ గా ఉండనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ గా ఈ ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి సంబంధించి విడుదలైన పోస్టర్ కూడా ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే క్లాసీ సాంగ్ గా ఉండనుందని తెలియజేస్తోంది. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు టీం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి అన్ని హంగులతో ఆల్ క్లాస్ ఆడియన్స్, ఫాన్స్ కి ఫీస్ట్ గా, సంక్రాంతి ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్ గా ఉండనున్నాయి. జనవరి 11, 2020 న ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.

- Advertisement -

Related Posts

‘మ్యాస్ట్రో’ ప్యాకప్… జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న నితిన్!

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో కూడా హీరో నితిన్ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చెక్, రంగ్ దే రెండు చిత్రాలు విడుదలచేసి, ఇప్పుడు...

చిరంజీవి సినిమా టైటిల్ తో కార్తికేయ కొత్త సినిమా..! పోస్టర్, టైటిల్ రిలీజ్

కార్తికేయ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కాసారిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టయింది. అప్పటినుంచీ కార్తికేయ హీరోగా వరుసగా సినిమాలు హిట్, ఫ్లాపులతో సంబంధం...

వయసు మళ్ళిన హీరోయిన్ కూడ బాలకృష్ణ సినిమాకు నో చెప్పిందా ?

మన సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే.  అందునా బాలకృష్ణ చిత్రాలకు కథానాయికలు దొరకడం ఇంకా క్లిష్టమైంది.  'అఖండ' చిత్రానికి హీరోయిన్ ను తీసుకురావడానికి ఆ చిత్ర దర్శకుడు బోయపాటి...

Latest News