లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత మళ్లీ తెర ముందకొచ్చింది. ఆమె రీఎంట్రీ ఇచ్చిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. మహేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 11న సంక్రాంతి సందర్భంగా విడుదలై అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. లేడీ అమితాబ్‌గా పేరుతెచ్చుకున్న విజయశాంతి ఈ సినిమాలో ఎలా కనిపించబోతోందా? అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే పవర్ఫుల్ పాత్రలో ప్రొఫెసర్ భారతిగా ఆమె నటన ఆకట్టుకుంటోంది.
ముందు ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించని విజయశాంతి కథ, అందులోని తన పాత్ర నచ్చడంతో కాదనలేక ఒకే చెప్పేశారట. సినిమాలో ఆమె పాత్రనే కథకు కీలకంగా మారి ప్రేక్షకులకు సరికొత్త ఫీల్‌ని అందిస్తుండటంతో చిత్ర యూనిట్ మా ఛాయిస్ కరెక్టే నని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చాలా ఏళ్ల విరామం తరువాత అంగీకరించిన ఈ చిత్రం కోసం రాములమ్మ గట్టిగానే లాగిందట. పారితోషికం కింద కోటిన్నర తీసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. టాప్ హీరోయిన్స్ కోటి తీసుకుంటుంటే అంతకు మించి రాములమ్మ వసూలు చేయడం ఆసక్తికరంగా మారింది.