నాచురల్ హీరో నాని మరో కొత్త సినిమాకి సంతకం చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో ఒక కొత్త దర్శకుడితో నాని సినిమా ఉండబోతుంది. ఎరగం శ్రీరామ్ అనే దర్శకుడు గతంలో ‘యాత్ర’, ‘శమంతకమణి’ మొదలైన సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసాడు. ఈ సినిమా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ప్రస్తుతం నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఆగష్టు 30 న విడుదల కానుంది. అటు పైన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాకి పని చేస్తున్నాడు నాని.
యువి క్రియేషన్స్ లో నాని కొత్త సినిమా
