హీరో రాంచరణ్ తేజ్ నేడు విజయవాడ బందర్ రోడ్డులో హ్యాపీ అనే మొబైల్ స్టోర్ని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇటీవలె జరిగిన `మా` కాంట్రవర్సీ పై ఆయన స్పందించారు. `మా`లో ఉన్న చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం పై సినిమా రంగంలో ఉన్న ఎంతో మంది పెద్దలు ఉన్నారని ఆ సమస్యలన్నిటికి పరిష్కారం వాళ్ళే చూసుకుంటారన్నారు.
కాగా.. ఇటీవల ‘మా’ డైరీ ఆవిష్కరణ సభలో జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా ఎన్నికైన `మా` అసోషియేషన్ వారు ఎందుకో గాని మొదటి నుంచి వారిలో వారికి సఖ్యత లేదన్న విషయం తెలిసిందే. అయితే అంతర్గతం ఉండే ఈ గొడవలు ఈ మధ్య అందరికీ తెలిసేలా రచ్చ రచ్చ అయ్యాయి. అధ్యక్షుడు నరేష్ తీరు పై వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ వేదిక మీద పలువురు పెద్దల సమక్షంలోనే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇవన్నీ ఇన్నిరోజులు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళలో వాళ్ళకే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఇవి రచ్చకెక్కాయో అప్పుడే ఇండస్ట్రీ పరువుపోయినట్లు అనిపించింది. అంతమంది మీడియా సమక్షంలో హీరో రాజశేఖర్ అలా ప్రవర్తించడం సరికాదని చాలా మంది సినీ పెద్దలు భావించారు.