మణి రత్నం సినిమాలో నెగటివ్ పాత్రలో ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్ తెలుగులో కనిపించి చాలా కాలం అయింది. ఆమె ఆఖరున రజిని సరసన రోబో సినిమాలో కనిపించింది. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య దక్షిణాదిన మణి రత్నం మరియు శంకర్ సినిమాల్లోనే కనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు మణి రత్నం సినిమా చేస్తున్నట్టు ధృవీకరించారు.

అది కూడా హీరోయిన్ గా కాదట. ఒక నెగటివ్ పాత్రలో కనిపించనున్నారట. తమిళ నవల ‘పొన్నియన్ సెల్వం’ ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో విక్రమ్ , జయం రవి , కార్తీ, మోహన్ బాబు మొదలైన వారు ఉన్నారట.