భారీ బడ్జెట్ చిత్రంతో కృష్ణ వంశీ

కృష్ణ వంశీ ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాలు అందించినా వరుస ప్లాప్ల వల్ల ఇప్పుడు ఆయన సినిమాలకు దూరం అయ్యారు. ఎంతో కష్టపడి తీస్తున్న సినిమాలు కూడా ప్లాప్ అవుతుండడంతో ఆయనతో సినిమా తీసే వారే కరువయ్యారు. అయితేనేం ఆయన ఒక స్త్రీ ప్రధానమైన భారీ బడ్జెట్ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా కి ‘రుద్రాక్ష’ అని టైటిల్ పెట్టారు.

అయితే ఈ సినిమాకు నిర్మాత కోసం ఎందరినో సంప్రదించినా లాభం లేకపోయింది. చివరికి స్టార్ నిర్మాత బండ్ల గణేష్ ముందుకొచ్చారు. అంతే కాదు ఆయన రాకతో ఒక స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. ఇప్పటికైనా కృష్ణ వంశీ తన ప్రతిభ తో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆశిద్దాం.