కరోనా మహమ్మరి విజృంభిస్తున్న నేపథ్యంలో చిరంజీవి చైర్మన్గా కరోనా క్రైసిస్ చారిటీ మన కోసం అనే చారిటీని సినీ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు విరాళాలు అందజేశారు. యాభై వేల నుంచి కోటి రూపాయల వరకు ఈ చారిటీకి హీరోలు విరాళాలు అందించారు. హీరోయిన్లలో ఒక్క లావణ్య త్రిపాఠి మాత్రమే లక్ష విరాళం అందించింది. మరెవరూ స్పందించలేదు.
దీనిపై బ్రహ్మాజీ ఘాటుగా స్పందించాడు. ముంబైకి చెందిన హీరోయిన్లో ఇక్కడి సినిమాల్లో నటిస్తూ కోట్లకు కోట్లు తండుకుంటున్నారని, కానీ ఈ ఆపత్కాలంలో మాత్రం విరాళాలు ఇవ్వడానికి మాత్రం ఒక్కరు తప్ప ఏ హీరోయిన్ కూడా ముందుకు రాలేదని ఘాటుగా విమర్శలు గుప్పించాడు చాలా వరకు హీరోయిన్ బ్రహ్మాజీ మాటల్ని పట్టించుకోలేదు.
అయితే తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ స్పందించింది. సీసీసీకి తన వంతు బాధ్యతగా 2 లక్షలు విరాళం అందించింది. దీంత ఇండస్ట్రీ వాళ్లంతా బ్రహ్మాజీ డైలాగ్స్ వర్కవుట్ అవుతున్నాయని చెప్పుకుంటున్నారు.