బిగ్ న్యూస్‌: ప్ర‌భాస్ 21వ సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది!

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం 20 సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్నియువీ క్రియేష‌న్స్‌తో క‌లిసి గోపీకృష్ణ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తోంది. `సాహో` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో కొంత విరామం తీసుకుని క‌థ‌లో మార్పులు చేర్పులు చేసి ఇటీవ‌లే ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో ప్రారంభించారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఓ కొత్త ప్ర‌పంచం నేప‌థ్యంలో రూపొందుతోంద‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ ఇటీవ‌లే ప్ర‌క‌టించ‌డు. ఇదిలా వుంటే ప్ర‌భాస్ 21వ చిత్రాన్ని `మ‌హాన‌టి`తో విమ‌ర్శ‌కుల‌ని సైతం మెప్పించిన నాగ్ అశ్విన్‌తో చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బుధ‌వారం ఈ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ వైజ‌యంతీ మూవీస్ వ‌ర్గాలు ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఫిల్మ్‌!వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంత‌కీ ఈ చిత్రాన్ని ఏ నేప‌థ్యంలో తెర‌కెక్కించ‌బోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వుంటుందా? అనే వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంది.