బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రిషిక‌పూర్ మృతి

బాలీవుడ్‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఓ ప‌క్క మ‌హారాష్ట్ర క‌రోనాతో విళ‌య‌తాండ‌వం చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న వేళ లెంజెండ‌రీ యాక్ట‌ర్స్ క‌న్నుమూస్తున్నారు. బుధ‌వారం ది గ్రేట్ యాక్ట‌ర్ ఇర్ఫాన్‌ఖాన్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ విషాదం నుంచి ఇంకా బాలీవుడ్ తేరుకోక‌ముందే మ‌రో పిడుగులాంటి వార్త‌. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు రిషీక‌పూర్ (67)అనారోగ్యంతో ముంబైలోని ఎన్‌హెచ్ రిల‌య‌న్స్ ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు.

బుధ‌వారం రాత్రి రిషిక‌పూర్ ఆరోగ్యం క్షీణించ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలో చేర్చారు. క్యాన్స‌ర్‌తో గ‌త కొంత కాలంగా పోరాడుతున్న ఆయ‌న శ్వాస కోస సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఆ కార‌ణంగానే ఆశ్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని ఆయ‌న సోద‌రుడు ర‌ణ్‌ధీర్‌క‌పూర్ వెల్ల‌డించారు.

క్యాన్స‌ర్ కార‌ణంగా బాధ‌ప‌డుతున్న రిషిక‌పూర్ గ‌త ఏడాది సెప్లెంబ‌ర్‌లో అమెరికా వెళ్లి క్యాన్స‌ర్ కోసం చికిత్స పొందారు. తీరిగి ఇండియా వ‌చ్చారు. ఆ త‌రువాత ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రెండు సార్లు ఆసుప‌త్రి చేరారు. కోలుకున్నారు.