బాలీవుడ్ లో అవకాశం దక్కించుకున్న మిల్కి బ్యూటీ

హీరోయిన్‌గా అయిపోయిందన్న ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో పైకి లేవడం తమన్నాకి కొత్తకాదు. ఎఫ్-2తో హిట్ బాటలోకి వచ్చేసిన తమన్నా చేతిలో అవకాశాలు బాగానే ఉన్నాయట. దానికి మరో బాలీవుడ్ ప్రాజెక్టు తోడవడంతో తమన్నా -మంచి ఊపులో కనిపిస్తోంది. బాలీవుడ్‌లో వైవిధ్యమైన ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖీతో తెరకెక్కుతోన్న ‘బోలె చుడియా’ చిత్రంలో తమన్నాకు అవకాశం దక్కిందన్నది సమాచారం.

ఇంతకుముందు సిద్దిఖీకి జోడీగా ఎంపిక చేసుకున్న మౌనిరాయ్ చివరి నిమిషంలో ప్రాజెక్టు వదులుకోవడంతో -ఆ పాత్ర తమ్మూ బేబీకి దక్కిందని అంటున్నారు. ఇంతకుముందూ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ ప్రాజెక్టులు చేసినా బ్రేక్ దక్కలేదు. అప్పుడు కాలం కలిసిరాలేదు. ఇప్పుడు తన టైం
నడుస్తోంది కనుక -బోలె చుడియాతో మరిన్ని అవకాశాలు దక్కించుకోగలనన్న నమ్మకాన్ని
వ్యక్తం చేస్తోంది.

ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని తనదైన పంథాలో తెరకెక్కిస్తున్నడు కొత్త దర్శకుడు, నవాజుద్దీన్ సోదరుడు షమాస్. అలాంటి వైవిధ్యమైన కథలో మంచి పాత్ర చేయడం కొత్త అనుభూతికి
గురవుతున్నట్టు తమ్మూ చెబుతోంది.