బాలీవుడ్‌కు ఏమైంది..న‌సీరుద్దీన్ షాపై వదంతులు!

ఇర్ఫాన్‌ఖాన్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో బాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. గ‌త కొంత కాలంగా న్యూరో ఎండో క్రైమ్ ట్యూమ‌ర్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఇర్ఫాన్‌ఖాన్ కొల‌న్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా బుధ‌వారం మృతి చెందిన విష‌యం తెలిసిందే. 2018 నుంచి ఈ అరుదైన వ్యాధితో పోరాడిన ఇర్ఫాన్ చివ‌ర‌కు ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు.

ఈ విల‌క్ష‌ణ న‌టుడు చ‌నిపోయి రెండు రోజులైనా గ‌డ‌వ‌క ముందే మ‌రో సీనియ‌ర్ న‌టుడు రిషిక‌పూర్ కూడా క్యాన్స‌ర్ కార‌ణంగా మృతి చెంద‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌‌ని క‌ల‌చివేస్తోంది. ఏం జ‌రుగుతోంది? అని తెలిసేలోపే ఇద్ద‌రు లెజెండ‌రీ యాక్ట‌ర్స్ కాల గ‌ర్భంలో క‌లిసిపోయారు. రిషి క‌పూర్ మ‌ర‌ణ వార్త తెలిసి బిగ్‌బి అబితాబ్ కుప్ప‌కూలిపోయార‌ట‌. ఈ విష‌యాన్నే ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించి భావోద్వేగానికి లోన‌య్యారు.

ఈ రెండు విషాదాల‌తో షాక్‌లోకి వెళ్లిపోయిన బాలీవుడ్‌కు మ‌రో షాక్ త‌గ‌ల‌బోతోందా? ద‌ఇగ్రేట్ యాక్ట‌ర్ న‌సీరుద్దీన్ షా ఆరోగ్యం కూడా క్షీణించిందా? అని వార్త‌లు రావ‌డం మొద‌లైంది. జాతీయ మీడియాలో న‌సీరుద్దీన్ షా ఆరోగ్యంపై బ్రేకింగ్‌లు గురువారం అర్థ్ర రాత్రి రావ‌డంతో అంతా షాక్‌కు గుర‌య్యారు. ఈయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని, నాన్న ఆరోగ్యం బాగానే వుంద‌ని, అవ‌న్నీ ఫేక్ వార్త‌ల‌ని న‌సీరుద్దీన్ షా త‌న‌యుడు వివాన్ షా ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. దీంతో బాలీవుడ్ వ‌ర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ‌