బాలయ్యకు, చిరంజీవికి తేడా ఇదే 

Chiranjeevi wishes Balakrishna
గత కొన్నిరోజులుగా టాలీవుడ్లో ఒక కోల్డ్ వార్ నడుస్తోంది.  తనను సినీ పెద్దల సమావేశానికి పిలవలేదని, ఆ మీటింగ్లో భూములు పంచుకునే చర్చలు పెట్టుకున్నారని బాలయ్య ఫైర్ అయ్యారు.  దానికి మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ కావడంతో వివాదం మరింత పెద్దదైంది.  ఎంత పెద్దదంటే మెగా వెర్సెస్ నందమూరి అనేంత పెద్దది.  వివాదంలో ఇరు హీరోల అభిమానులు, సామాజిక వర్గాలు ఇన్వాల్వ్ కావడంతో వివాదం రక్తి కట్టింది.  ఒకానొక దశలో నాగబాబు నేను బాలకృష్ణ స్థాయి వ్యక్తిని కాదంటూ సైలెంట్ అయినా బాలయ్య మాత్రం తగ్గలేదు. 
 
తన 60వ పుట్టినరోజు సంధర్భంగా ప్రముఖ వార్తా ఛానెళ్లు, పలు యూట్యూబ్ ఛానెళ్ళకు ఫేస్ టూ ఫేస్  ఇంటర్వ్యూలు ఇచ్చారు బాలకృష్ణ.  గత ఎన్నికలప్పుడు కూడా ఆయన ఇన్ని ఇంటెర్వ్యూలు ఇవ్వలేదు.  ఇక ఇంటర్వ్యూలన్నీ ఒక పద్దతిలో జరిగాయి.  బాలయ్య వ్యక్తిత్వాన్ని, నటనా జీవితాన్ని, సేవా కార్యక్రమాలను, ఎన్టీఆర్ గారిని, చంద్రబాబును, టీడీపీని పొగిడేలా చాలా వ్యాఖ్యాతల ప్రశ్నలు, బాలయ్య జవాబులు ఇలా సాగాయి ఇంటర్వ్యూలన్నీ.  ఇంతవరకు బాగానే ఉన్నా మధ్యలో ప్రశ్నలడిగేవారు ఉద్దేశ్యపూర్వకంగా చిరంజీవి ప్రస్తావన తేవడం వాటికి బాలయ్య డోంట్ కేర్, ఎవడైతే నాకేంటి అన్నట్టు సమాధానాలు ఇవ్వడం మంచిగా అనిపించలేదు. 
 
ప్రజెంట్ చిరు ఇండస్ట్రీ పెద్దగా భాద్యత మొత్తాన్ని భుజాన వేసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి షూటింగ్ అనుమతులు, టికెట్ ధరల్లో మార్పులు, థియేటర్ల రీఓపెన్, నిలిచిపోయిన నంది అవార్డుల వేడుకను నిర్వహించడం, పరిశ్రమలోని కార్మికులకు సహాయం, వైజాగ్లో స్టూడియోల నిర్మాణం ఇలా పలు సమస్యల మీద పనిచేస్తున్నారు.  అంతేకానీ ఎక్కడా బాలయ్య వివాదం మీద మాట్లాడలేదు.  కానీ బాలకృష్ణ మాత్రం తనను అవమానించారని, గతంలో గెట్ టూ గెథర్ వేడుకకు పిలవలేదని అంటూ విమర్శలు చేశారు.  దాసరి లేని లోటు తెలుస్తోందని చిరు పెద్దరికం మీద పరోక్ష విమర్శలు చేశారు.  
 
చిరుతో రిలేట్ అయ్యున్న ప్రతి అంశం మీద బాలయ్య నెగెటివ్ రెస్పాన్స్ ఇచ్చారే తప్ప మంచిగా ఒక్క మాట కూడా చెప్పలేదు.  కానీ చిరు మాత్రం ఈరోజు బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా ’60లో అడుగుపెడుతున్న మా బాల‌కృష్ణ‌కి ష‌ష్టిపూర్తి శుభాకాంక్ష‌లు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్ల సంబరం కూడా జ‌రుపుకోవాల‌ని, అంద‌రి అభిమానం ఇలానే పొందాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ హుందాగా శుభాకాంక్షలు చెప్పారు.  ఆయన తీరు చూస్తే అసలు బాలయ్యతో వివాదమే లేదన్నట్టు బిహేవ్ చేశారు.  ఇది చూసిన నెటిజన్లు బాలయ్యకు ముక్కు మీద కోపం ఉంటే చిరు మృధు స్వభావి.  ఇదే బాలయ్యకు, చిరుకు తేడా.  బాలయ్య కూడా వివాదానికి ఇంతటితో స్వస్తి
చెబితే మంచిది అంటున్నారు.