బాలకృష్ణ సినిమాలో భూమిక

ఒకప్పటి హీరోయిన్ భూమిక అందం గురించి ఆమె నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ మధ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో వదిన, అక్క పాత్రలు పోషిస్తోంది. తాజాగా బాలకృష్ణ సినిమా కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో బాలకృష్ణ సరసన ఒక కీలక పాత్రకు ఎంపిక చేశారట.

ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక అనే ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నారు. ఇప్పుడు భూమిక ఈ సినిమాలో బాలకృష్ణ గతం ఎపిసోడ్లలో కనిపిస్తుందట. భూమిక, బాలకృష్ణ ల పై ఉండే సన్నివేశాలను కోనసీమలో చిత్రించనున్నారు.